Latest News

Saturday, April 23, 2016

రాజా ఎవరిమీద చేయ్యి వేసాడో... తేలుసా || Raha yevari meedha cheyyi vesaado... telusaa


రాజా ఎవరిమీద చేయ్యి వేసాడో... తేలుసా

నారా రోహిత్, ఇషా తల్వార్ జంటగా నటించిన చిత్రం ‘రాజా చెయ్యి వేస్తే’. తారకతన్న ఓ ప్రధాన పాత్రలో కనపడనున్నారు. ప్రదీప్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. వారాహి చలన చిత్రంపై సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతం అందించారు. తారకరత్న విలన్ పాత్రలో నటిస్తుండటం, ఇప్పటికే విడుదల ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. వరుస సినిమాలతో జోరు మీదున్న రోహిత్‌కి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని మిగులుస్తుందన్నది, అస్సలు రాజా ఎవరిమీద చేయ్యి వేసాడో ఈ నెల 29 తేలనుంది.



మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us

Facebook          Twitter          YouTube          Blog          Google+

Friday, April 22, 2016

శోభన్‌ బాబు సినిమా మొదలైంది || Shobhan Babu movie started


శోభన్‌ బాబు సినిమా మొదలైంది

గోల్కొండ హైస్కూల్‌, తను నేను, చిత్రాల హీరో సంతోష్‌ శోభన్‌ కథానాయకుడిగా సింప్లీ జిత్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ దగ్గర అసోసియేట్‌గా వర్క్‌ చేసిన శ్రీనివాస్‌ చక్రవర్తి దర్శకత్వంలో అభిజిత్‌ జయంతి ఓ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ జూన్‌ నుంచి స్టార్ట్‌ అవుతుంది. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తారు.


మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us

Facebook          Twitter          YouTube          Blog          Google+

సరైనోడు సినిమా రివ్యు || Sarainod Movie Review



సరైనోడు సినిమా రివ్యు || Sarainod Movie Review

TOLLY BEATS RATING: 3.25/5

మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. బన్నీని పూర్తి స్థాయి మాస్ హీరోగా పరిచయం చేసే సినిమాగా ప్రచారం పొందిన ‘సరైనోడు’, ఆ టార్గెట్‌ను ఎంతవరకు రీచ్ అయ్యాడూ? తారాస్థాయిలో ఉన్న అంచనాలను అందుకోగలిగాడా? చూద్దాం...

కథ :
బార్డర్‍లో కంటే సమాజంలోనే ఎక్కువ సమస్యలున్నాయని చెప్పి, గన (అల్లు అర్జున్) తన మిలిటరీ ఉద్యోగాన్ని వదిలేసి హైద్రాబాద్‌లో కుటుంబంతో కలిసి జీవిస్తుంటాడు. బాబాయ్ (శ్రీకాంత్)తో కలిసి వ్యవస్థకు అందని నేరగాళ్లకు తన స్టైల్లో బుద్ధి చెప్పడమే గన పని. ఇదిలా సాగుతుండగానే, గన, తానుండే ఏరియాకి ఎమ్మెల్యే అయిన హన్షితా రెడ్డి (క్యాథరిన్ థ్రెసా)తో ప్రేమలో పడతాడు. హన్షితాతో గన పెళ్ళి ఫిక్స్ అవుతున్న సమయంలో, అతణ్ణి వెతుక్కుంటూ, కాపాడమని మహాలక్ష్మి (రకుల్ ప్రీత్) వస్తుంది.

మహాలక్ష్మి ఏ ఆపదలో ఉండి గన కోసం వచ్చింది? మహాలక్ష్మికి, గనకి సంబంధం ఏంటి? తన బ్యాక్‌గ్రౌండ్‌ని టచ్ చేస్తే, తనకు కావాల్సింది దొరక్కపోతే ఎంతకైనా తెగించే వైరం ధనుష్‌ (ఆది)కి మహాలక్ష్మి గ్రామానికి ఉన్న సంబంధం ఏంటి? వ్యవస్థ మొత్తాన్నీ తన చెప్పు చేతల్లో పెట్టుకున్న ధనుష్‌ని గన ఎలా ఎదిరించాడు? లాంటి ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే అల్లు అర్జున్‌ను పూర్తి స్థాయి మాస్ హీరోగా పరిచయం చేసేందుకు ఏయే అంశాలైతే అవసరమో వాటిని దర్శకుడు బోయపాటి సరిగ్గా వాడిన విధానం గురించి చెప్పుకోవచ్చు. ఇక ఇలాంటి ఒక మాస్ పాత్రలో నటించగలనని ఋజువు చేసుకున్న బన్నీ కూడా ఈ సినిమాకు హైలైట్స్‌లో ఒకరుగా చెప్పుకోవచ్చు. యాక్టింగ్‌లో, డైలాగ్ డెలివరీలో, స్టైల్‌లో అన్నింటా బన్నీ కట్టిపడేశాడు. ముఖ్యంగా యాక్షన్స్ సీక్వెన్సెస్, పాటల్లో బన్నీ స్టామినా ఏంటో ఈ సినిమాతో మరోసారి స్పష్టం అవుతుంది. ఇక సినిమాను చాలాచోట్ల తన ఈజ్‌, స్క్రీన్‌ ప్రెజెన్స్‌తో భుజాలపై మోసుకొచ్చాడనే చెప్పాలి.

విలన్ ఆది పినిశెట్టిని సినిమాకు మరో హైలైట్‌గా చెప్పుకోవచ్చు. హీరోగా బాగానే మెప్పిస్తోన్న ఆది, ఈ సినిమాలో విలన్‌గా చేసి సినిమాకు మంచి స్థాయి తీసుకొచ్చాడు. ముఖ్యంగా తక్కువ మాట్లాడుతూ, స్టైలిష్‌గా కనిపిస్తూనే ఈ స్థాయి విలనిజం చూపడంలో ఆది ప్రతిభ బాగుంది. పాటల చిత్రీకరణ ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. హీరోయిన్లు ఇద్దరూ తమ తమ అందచందాలతో బాగా ఆకట్టుకుంటారు. రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పట్లానే తాను మంచి నటినేనని మరోసారి నిరూపించుకుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్‍లో రకుల్ నటన చాలా బాగుంది. ఇక క్యూట్‌గా కనిపిస్తూనే, తన పాత్రకు నటన పరంగా క్యాథరిన్ థ్రెసా మంచి న్యాయం చేసింది. శ్రీకాంత్ తన పాత్రలో ఒదిగిపోయాడు. మిగతా వారంతా తమ పరిధిమేర బాగా నటించారు.

సినిమా పరంగా చూస్తే.. హీరో, విలన్‌ల ఇంట్రడక్షన్; వారిద్దరికీ ‘బ్యాక్‌గ్రౌండ్ చూస్తావా?’ అన్న కామన్ పాయింట్‌తో ఉన్న కనెక్షన్, ఇంటర్వెల్ బ్లాక్, సెకండాఫ్‌లో పర్ణశాల గ్రామంలో ఉండే ఓ కొత్తదనమున్న ఫైట్, బ్రహ్మానందం కామెడీ, వినడానికి, చూడ్డానికి బాగున్న పాటలను ప్లస్‌పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు అసలైన మైనస్ పాయింట్ అంటే కథలో ఎక్కడా కొత్తదనం అన్నదే లేకపోవడం గురించి చెప్పుకోవాలి. హీరో, విలన్‌ల ఆలోచన విధానాల్లో ఉండే చిన్న కామన్ పాయింట్ మినహాయిస్తే పూర్తి కథ ఇప్పటికే చాలా సార్లు చూసి ఉన్నాం. అలాంటి ఓ సాదాసీదా కథలోనే వచ్చే హీరో-హీరోయిన్ల మధ్యన ప్రేమలో కూడా బలమైన ఎమోషన్ కరువైంది. అల్లు అర్జున్-క్యాథరిన్‍ల మధ్యన వచ్చే సన్నివేశాలు క్యూట్‌గానే ఉన్నా, లాజిక్ పరంగా చూస్తే, అవి తేలిపోతాయి. ఇక అల్లు అర్జున్-రకుల్ ప్రీత్‌ల జర్నీ కూడా లాజిక్ లేనట్టే సాగిపోతుంది. ఈ ఒక్క రెండు అంశాలే కాకుండా సినిమాలో చాలాచోట్ల లాజిక్ అన్న అంశానికి చోటు లేదు.

రెండున్నర గంటలకు పైగా చెప్పాల్సిన స్థాయి ఉన్న కథ కాకపోయినా సినిమాను అంత నిడివిలో చెప్పాలనుకోవడం ఓ మైనస్ పాయింట్‌గానే చెప్పుకోవాలి. అలాగే మాస్ అనే ఆంశాన్నే పట్టుకొని కొన్నిచోట్ల యాక్షన్ సీన్లలో అతి ఎక్కువ చేసినట్లు కనిపించింది. ఈ క్రమంలో హింస, రక్తం చాలా ఎక్కువయ్యాయి. ఇక ఫస్టాఫ్ స్థాయిలో సెకండాఫ్ లేకపోవడం వల్ల సెకండాఫ్ నుంచి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తే నిరుత్సాహం తప్పదు. వ్యవస్థలోని లోపాలను హీరో ఒంటిచేత్తో ఎదుర్కోవడమనే పాయింట్ మాస్ అంశంగా చూస్తే ఫర్వాలేదనిపించినా, ఓవరాల్‌గా చూస్తే ఇదంతా ఓవర్‌గా కనిపిస్తుంది. అదీకాకుండా హీరో మిలిటరీ ఉద్యోగాన్ని వదిలేసి ఎందుకు వచ్చాడన్న దానిపై కూడా పూర్తి క్లారిటీ ఉండదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ముందుగా దర్శకుడు బోయపాటి శ్రీను గురించి చెప్పుకోవాలి. బోయపాటి రాసుకున్న కథ పూర్తిగా కమర్షియల్ అంశాలనే నింపుకొని చెప్పుకోవాల్సినంత కొత్తగా ఏమీ లేదు. అయితే ఆ కమర్షియల్ అంశాలనే ప్రధానంగా చేసుకొని బోయపాటి అల్లిన మాస్ ఫైట్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్ రచయితగా ఆయన మార్క్ చూపెడతాయి. ఇక దర్శకుడిగా బోయపాటికి ఓ స్పెషల్ మార్క్ ఉంది. ఈ సినిమాలో ఆయన మార్క్‌ని మళ్ళీ చూడొచ్చు. హీరోయిజంని ఎలివేట్ చేసే సన్నివేశాలతో పాటు కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లోనూ భోయపాటి ప్రతిభను చూడొచ్చు.

ఇక సంగీత దర్శకుడు థమన్ అందించిన పాటలు సినిమాకు హైలైట్స్‌లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే పాటలన్నీ సూపర్ హిట్ కాగా, విజువల్స్‌తో కలిపి చూసినప్పుడు ఆ పాటల స్థాయి మరింత పెరిగిందనే చెప్పాలి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పరంగానూ థమన్ బాగా ఆకట్టుకున్నాడు. రామ్-లక్ష్మణ్ రూపొందించిన ఫైట్స్‌ సినిమాకు మంచి మాస్ ఫీల్ తెచ్చిపెట్టాయి. రిషీ పంజాబి సినిమాటోగ్రఫీకి ఎక్కడా వంక పెట్టలేం. కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ ఫర్వాలేదు. ఎం.రత్నం అందించిన డైలాగ్స్ కూడా బాగున్నాయి. అల్లు అరవింద్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే!

తీర్పు :

తెలుగులో మాస్ సినిమా అంటే ముందే తయారు చేసి పెట్టుకున్న ఓ ఫార్మాట్ ఉంది. అల్లు అర్జున్‌ని పూర్తి స్థాయి మాస్ హీరోగా పరిచయం చేసే సినిమాగా ప్రచారం పొందిన ‘సరైనోడు’ కూడా అదే ఫార్మాట్‌ను నమ్ముకొని వచ్చిన మాస్ ఎంటర్‌టైనర్. ఫార్మాట్ ప్రకారమే సాగే సినిమా అయినా, పొందిగ్గా అల్లిన మాస్ ఎలిమెంట్స్; అదిరిపోయే హీరో, విలన్‌ల క్యారెక్టరైజేషన్, నటన; వినడానికి, చూడడానికి బాగున్న పాటలు; బన్నీ ఒక పూర్తి స్థాయి మాస్ హీరోగా నిలబడగలనని నిరూపించేలా తనని తాను మలుచుకున్న విధానం లాంటివి ఈ సినిమాకు మంచి ప్లస్ పాయింట్స్‌గా నిలుస్తాయి. ఇకపోతే కథ మరీ పాతది కావడం, లాజిక్ అన్న అంశానికి సినిమాలో పెద్దగా చోటన్నది లేకపోవడం, కాస్త లెంగ్త్ ఎక్కువవ్వడం లాంటివి ఈ సినిమాకు మైనస్ పాయింట్స్‌గా చెప్పుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ ‘సరైనోడు’, ఏయే అంశాలైతే చెప్పబోతున్నాడని ప్రచారం పొందాడో, ఆయా అంశాలనే చెప్పుకుంటూ వస్తూ ఓ మాస్ పంచ్ ఇస్తూ ఆకట్టుకోవడంలో చాలావరకు విజయం సాధించాడనే చెప్పాలి.



మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us



Facebook          Twitter          YouTube          Blog          Google+

నేను అన్నగారి అభిమానిని... CM KCR


నేను అన్నగారి అభిమానిని... CM KCR

నందమూరి బాలక్రిష్ణ 100వ చిత్రం "‎గౌతమీపుత్ర శాతకర్ణి‬" ప్రారంభొత్స వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. క్రిష్‬ దర్సకత్వం చేస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవానికి అతీరధ మహారధులు వచ్చారు.

ఈ వేడుకకి వచ్చిన CM కేసిర్, తను మహా నటుడు అన్నగారి విరాభిమాని అని చెప్పారు. NTR ఘాట్ ఎప్పటికీ అన్నగారి పేరు మీదనే ఉంటుందని చెపారు. బాలయ్య నటిస్తున్న "‎గౌతమీపుత్ర శాతకర్ణి‬" సినిమాని అందరికంటే ముందుగా తనకు చుపించాలి అని బాలయ్యను కోరారు.


మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us

Facebook          Twitter          YouTube          Blog          Google+

సరైనోడు సరిగ్గానే ఉన్నాడు...

సరైనోడు సరిగ్గానే ఉన్నాడు...

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కలయికలో ఎన్నో అంచనాలతో ఈరోజు విడుదలైన "సరైనోడు" కి మంచి స్పందన లభిస్తుంది. మెగా అభిమానులకి పండగలా ఉంది సినిమా. బ్రూస్లీ, సర్దార్ సినిమలు నిరుత్సాహ పరిచినా, సరైనోడు మాత్రం ప్రేక్షకులకి పండుగ వాతావర్ణం తీస్కొచింది.

సినిమా రివ్యూ అతి త్వరలో...


---రవి కిరణ్ మాదినీడి

మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us


Facebook          Twitter          YouTube          Blog          Google+

Wednesday, April 20, 2016

సరైనోడు సరిగ్గా లేడా...? Sarainodu sarigga leda... ?


సరైనోడు సరిగ్గా లేడా...?


మన తెలుగు సినీ పరిస్రమలో సెంటిమెంట్లకి చాలా ప్రాదాన్యం ఇస్తారు. సినిమా విడుదల తేదీ మారినా, రీ-షూట్ కి వెల్లినా పరిస్రమ జనాలకి, ప్రేక్షకులకి అంచనాలు, అభిప్రాయాలు మారిపొతాయి.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కలయికలో ఎన్నో అంచనాలతో వస్తున్న "సరైనోడు" ఈ నేల 22న విడుదల తేదీని ప్రకటించారు దర్సకనిర్మాతలు. ఐతే ఈ సరైనోడు ఆకరి నిమిషం లొ రీ-షూట్ కి వెల్లింది. రామోజి ఫిల్మ్ సిటీలొ రీ-షూట్ చేస్తున్నారు. సరైనోడు రెండొవ భాగంలో చాలా సన్నివేశాలు నిరుత్సాహపరిచాయట, అందుకే కొన్ని ముఖ్య సన్నివేశాలని మళ్ళీ చిత్రీకరిస్తున్నారు.

ఐతే ఇప్పుడు ఈ సరైనోడు అనుకున్న తేదీకి వస్తాడా లేదా...? సరైనోడు సరిగ్గా ఉంటుందా లేదా... ? అన్న అనుమానం అభిమానుల్లొ కలవరపెడుతుంది.




మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us

Facebook          Twitter          YouTube          Blog          Google+

Sunday, April 17, 2016

పోలీస్‌ సినిమా రివ్యు || POLICE Movie Review


పోలీస్‌ సినిమా రివ్యు


TOLLY BEATS RATING: 3.25/5

తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీస్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తెలుగు విడుదల చేయడంతో ఈ సినిమాకు కొద్దికాలంగా మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంతమేరకు ఆకట్టుకుందీ? చూద్దాం...

కథ :

జోసెఫ్ కురివిల్లా (విజయ్) కేరళలోని ఒక చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత (బేబీ నైనిక)తో కలిసి సాధారణం జీవనం గడుపుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులూ లేకుండా సాఫీగా సాగిపోతుందనుకున్న అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చిపడతాయి. ఆ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయిన అనీ (అమీ జాక్సన్)కి జోసెఫ్, తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది.

హైద్రాబాద్‍లో నార్త్ జోన్‌కి డీసీపీగా పనిచేస్తూ, పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్, జోసెఫ్‌గా పేరు మార్చుకొని వేరేదో ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అతడి గత జీవితం ఏంటి? గత జీవితంలో అతడికి ఎవరితో శతృత్వం ఉంది? ఆ శతృత్వం వల్ల అతడి భార్య మిత్ర (సమంత), తల్లి రాధికలు ఏమయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే మొదట్నుంచీ చివరివరకూ అద్భుతమైన ఎమోషన్స్ క్యారీ అవుతూ ఉండడమనే పాయింట్ గురించి చెప్పాలి. ఒక కూతురితో ప్రశాంత జీవితం గడిపే తండ్రి ప్రయాణం; తల్లి, భార్యలతో అందంగా సాగిపోయే అతడి గత జీవిత ప్రయాణం, వృత్తి రీత్యా చూసే కొన్ని తట్టుకోలేని సంఘటలు.. ఇలా ఈ ప్రయాణాల చుట్టూ ఉన్న ఎమోషన్ కట్టిపడేసేలా ఉంటుంది. సినిమా పరంగా ఈ ఎమోషన్సే హైలైట్ అవుతూ సినిమాను నిలబెడుతూ వస్తుంటాయి. ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకే మేజర్ హైలైట్. హీరోయిజంతో పాటు అసలు కథలోని ఎమోషన్‌ని తారాస్థాయికి తీసుకెళ్ళే ఈ సన్నివేశం గురించి ఎంత చెప్పినా తక్కువే. క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని డైలాగ్స్ ఈ సినిమా సలు పాయింట్‌ను కొత్త కోణంలో పరిచయం చేయడం బాగుంది.

హీరో విజయ్ సినిమాను పూర్తిగా తన భుజాలపై మోసుకొచ్చాడు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో విజయ్ ఒదిగిపోయి నటించాడు. ఇక ఆయన ఫ్యాన్స్‌ని సంతృప్తి పరచేలా రూపొందించిన సన్నివేశాల్లో విజయ్ మాస్ పవర్ చూడొచ్చు. విజయ్ తర్వాత ప్రఖ్యాత తమిళ దర్శకుడు మహేంద్రన్ నటనను ఈ సినిమాకు మరో హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఎక్కువగా మాట్లాడకుండా చాలా కూల్‌గా ఉంటూనే ఎంతో వయలెంట్‌గా కనిపించేలా దర్శకుడు ఆ పాత్రను రూపొందించిన తీరు, దాన్ని మహేంద్రన్ పోషించిన విధానానికి వంకబెట్టలేం. సమంత ఎప్పట్లానే తనదైన యాక్టింగ్‌తో కట్టిపడేసింది. అమీ జాక్సన్‍ది చిన్న పాత్రే అయినా బాగా నటించింది. బేబీ నైనికా తన పాత్రకే ఓ అందాన్ని తెచ్చిపెట్టుకుంది. రాధికా, ప్రభు, రాజేంద్రన్.. తదితర నటీనటులంతా తమ పరిధిమేర బాగా నటించారు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మైనస్ పాయింట్ అంటే, సినిమాకు హైలైట్ అయిన ఎమోషన్స్ అన్నింటినీ కలిపేందుకు రాసిన కథ చాలా సార్లు చూసిందే కావడం. ఇలాంటిదే పోలీస్ కథకు ఫ్యామిలీ ఎలిమెంట్స్‌ను కలిపి గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఎంతవాడు గానీ..’ సినిమాకు, ‘పోలీస్’కు చాలా పోలికలున్నాయి. సూపర్ ఫస్టాఫ్ తర్వాత సినిమా అంతా ఒక పద్ధతిలో సాగకుండా ఏవేవో అంశాలను ఫోకస్ చేస్తూ కాస్త పక్కదారి పట్టినట్టు అనిపుస్తూంటుంది. పాటలు అంతంతమాత్రమే ఉండగా, అవి వచ్చే సందర్భాలు కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేవు.

అదేవిధంగా సినిమా వెళితే పూర్తిగా ఒకే ట్రాక్‌లోకి వెళ్ళిపోవడం చూస్తే, ఎపిసోడ్స్ చూస్తున్నట్టుగా ఉంటుంది. అయితే పూర్తిగా ఫ్యామిలీ, లేదంటే పూర్తిగా పోలీస్ లైఫ్.. ఇలా బ్లాక్‌లుగా కథ చెప్పడం అంత బాగోలేదు. ఒక పాయింట్ తర్వాత సినిమా రివెంజ్ డ్రామాను మాత్రమే చెప్తున్న ఫీలింగ్ తేవడం కూడా అసలు కథను పక్కదారి పట్టించింది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ముందుగా దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి. ఒక సూపర్ స్టార్ సినిమా నుంచి ఏయే అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూనే, ఎమోషన్‌ను ఎక్కడా పడిపోకుండా దర్శకుడు జాగ్రత్తపడ్డాడు. ఆయా ఎమోషన్స్‌ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్‌లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది. కథ పరంగా ఎప్పటికీ బలమైనదే అయిన రొటీన్ కథను ఎంచుకున్నా, దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో రచయితగా కొన్నిచోట్ల తడపడ్డాడు.

సాంకేతిక అంశాల పరంగా సినిమాటోగ్రాఫర్ జార్జి సి. విలియమ్స్ ప్రతిభను మరో హైలైట్‌గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్‌ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగానూ ఎలివేట్ చేయడం బాగుంది. జీ.వీ.ప్రకాష్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సన్నివేశాలను జీవీ మ్యూజిక్ మరింత ఎత్తుకి తీసుకెళ్ళాయి. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. కళైపుళి థాను ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వర్షన్ కోసం దిల్‌రాజు తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. ఎక్కడా తమిళ సినిమా అనే ఫీల్ రాకుండా చేయగలిగారు.

తీర్పు :

పోలీస్ కథంటే.. ఆ నేపథ్యాన్ని మాత్రమే చూపిస్తూ, ఒక్క కోణాన్నే చెప్పే కథలు ఒక రకం. అదే పోలీస్ కథకు వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ నేపథ్యాన్ని జతచేసి ఓ ఎమోషనల్ జర్నీని కూడా చెప్పడం మరో రకం. ‘పోలీస్’ అంటూ వచ్చిన విజయ్ కొత్త సినిమా.. రెండో రకం పోలీస్ డ్రామా. సినిమా ఆసాంతం కట్టిపడేసేలా సాగిపోయే ఎమోషన్స్, కొన్ని మాస్ ఎలిమెంట్స్, కొత్తగా కనిపించే ఇంటర్వెల్, క్లైమాక్స్, విజయ్ వన్ మ్యాన్ షో, సమంత యాక్టింగ్ లాంటి హైలైట్స్‌తో వచ్చిన ఈ సినిమాలో కథ ఇప్పటికే చాలాసార్లు చూసింది కావడం, సెకండాఫ్‌లో ఫస్టాఫ్ స్థాయిలో లేకపోవడం, అసందర్భంగా వచ్చే ఆకట్టుకోని పాటలు లాంటివి ప్రతికూలాంశాలు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఎక్కడా ఒక తమిళ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కల్పించని ఈ సినిమాను ఇదివరకు చూసిన కథైనా ఎప్పటికీ కొత్తగా కనిపించే ఎమోషన్స్ కోసం ఓసారి చూడొచ్చు.



---రివ్యూ బై విజ్ఞాన్ దాసరి

మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us






ఓ మల్లి సినిమా రివ్యు || Oo Malli movie Review


ఓ మల్లి  సినిమా రివ్యు

TOLLY BEATS RATING: 2.75/5

దాదాపు రెండు సంవత్సరాల క్రితమే సినిమా పూర్తి అయినా విడుదల వాయిదా పడుతూ వచ్చిన సినిమా ’ఓ మల్లి’. నటిగా, ఐటం గాళ్‌గా, వ్యాంప్‌ పాత్రల్లో నటిస్తూ దాదాపు దశాబ్దం పైగా సినిమాల్లో ఉన్న రమ్యశ్రీ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో చూద్దాం...

కథ :
ఈ కథ మొత్తం మల్లి (రమ్యశ్రీ) అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఇక కథలోకి వెళితే.. అరకులోయలోని ఓ గూడెంలో ఉండే మల్లి తండ్రి పెంపకంలో పెరుగుతుంది. తండ్రి నారిగాడు (యల్. బి. శ్రీరాం) ఓ తాగుబోతు. అయినా కూతురు అంటే ప్రేమ ఉన్నోడు. తనకి పెళ్లి చేయాలని అనుకుంటూ ఉంటాడు. అదే గూడెంలో ఉన్న సింగడు అనే వాడి కన్ను మల్లిపై పడుతుంది. నారిగాడికి బాగా సారా తాగించి తన ఇంటికి పెళ్లి పెత్తనం కోసం వెళతాడు. మత్తు దిగిన నారిగాడు సింగడిని అవమానించి పంపించివేస్తాడు. అవమానంతో అక్కడిని నుండి వెళ్ళిపోయినా సింగడు అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. ఓ సారి మల్లిపై అత్యాచారయత్నం చేయబోగా అందరూ కలిసి పట్టుకుని గూడెంలో పంచాయితీ పెట్టి సింగడికి గుండు గీయించి గూడెం నుంచి వెలివేస్తారు.

కల్తీసారా తాగి నారిగాడు మరణిస్తాడు. మల్లి ఒంటరిదైపోతుంది. మల్లిని చూసిన పక్కనే ఉండే మరో గూడెంకి చెందిన రాములయ్య(రఘబాబు), మల్లిని పెళ్లి చేసుకోవాలనుకుని తన తల్లికి ఇష్టం లేకపోయినా ఒప్పించి గూడెం పెద్దల సహాకారంతో పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తుంటాడు. అనుకోకుండా కల్తీసారా త్రాగడంతో రాములయ్యకు పక్షవాతం వచ్చి కాళ్ళు, చేతులు పడిపోవడంతో మల్లి చిన్నచిన్న కొయ్యబొమ్మలు తయారుచేసుకుని తన భర్తను చూసుకుంటుంది. ఆ ప్రయత్నంలోనే రైల్వేటికెట్ కలెక్టర్ అయిన రవి (ఆకాష్) మల్లిని చూస్తాడు. మల్లిని ఇష్టపడతాడు. ఆ తరువాత ఏం జరిగింది? అనేది మిగతా కథ. రవి కారణంగా మల్లి జీవితం ఎటువంటి మలుపులు తిరిగింది? తనవల్ల అవమానానికి గురైన సింగడు ఏమయ్యాడు? అన్నది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో పాటు అందులో ప్రధాన పాత్ర అయిన మల్లిగా నటించిన బి. రమ్యశ్రీనే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్. ఇటువంటి కథతో సినిమా చేయడం పూర్తిగా సాహసం అనే చెప్పాలి. మల్లిగా తనని తాను పూర్తిగా మార్చుకుని నటించడంతో పాటు, ఇతర నటీనటుల నుంచి నటనను రాబట్టుకోవడంలో కూడా దర్శకురాలిగా రమ్యశ్రీ మంచి మార్కులు కొట్టేసిందని చెప్పవచ్చు. ఇక సినిమాలోని
మిగిలిన నటీనటుల విషయానికి వస్తే.. మల్లి తండ్రి పాత్రలో నటించిన యల్ బి శ్రీరాం ఉన్నది కొద్దిసేపే అయినా ఆకట్టుకుంటాడు. తరువాత మల్లి భర్తగా నటించిన రఘుబాబు పక్షవాతం వచ్చిన వాడి పాత్రలో మెప్పించాడు. ఆకాష్ ఉన్నంతలో పర్వాలేదు. జయవాణితో సహా మిగతా నటీనటులు తమదైన శైలిలో నటించి అకట్టుకున్నారు. సినిమా పరంగా చూస్తే సెకండాఫ్ బాగుంది. ఈ పార్ట్‌లో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి.

మైనస్ పాయింట్స్ :

కథ ఎక్కడో చూసినట్టు అనిపించినా కొత్తగా తీయడానికి దర్శకురాలు ప్రయత్నించకపోవడం, అలాగే అక్కడక్కడా వచ్చే కొన్నిసన్నివేశాలు ఇది వరకు ఎప్పుడో చూసినట్లు అనిపించడం మైనస్ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు. కథనంలో అస్సలు ఊపు లేకపోవడం వలన ఊహించిందే జరుగుతోంది అని ప్రేక్షకులు అనుకుంటారు. అలాగే సందర్భం లేకుండా వచ్చే పాటలు చూడటానికి బాగున్నా, అసహనానికి గురిచేస్తాయి.

ఆర్థిక లేమి వలన అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్న స్త్రీల గురించి హాస్యంగా చిత్రీకరించడంతో సన్నివేశ ఔచిత్యంతో పాటు, దర్శకురాలు చెప్పాలనుకున్న అంశం కూడా పక్కదారి పట్టింది. అలాగే ఈ సినిమాకి ఇచ్చిన పబ్లిసిటీ వలన ఏదో ఊహించుకుని థియేటర్లలోకి వచ్చే ప్రేక్షకులకు అటువంటి అంశాలు కాకపోవడంతో అసహనానికి గురి అవుతారు. ఇక ఓ ప్రత్యేక కథాంశంతో తెరకెక్కిన సినిమా కావడం, పబ్లిసిటీని అందుకు విరుద్ధంగా చేయడం లాంటివి ఈ సినిమాకు మైనస్‌గా చెప్పుకోవచ్చు.

సాంకేతిక విభాగం :

సాంకేతికంగా ఈ సినిమాకి బాగా తోడ్పడిన విభాగాలు కొన్ని ఉన్నాయి. నిర్మాణ పరంగా చిన్న సినిమా అయినా ఏ సాంకేతిక అంశాల పరంగా సినిమా బాగుంది. ఒక్కొక్కదాని గురించి మాట్లాడుకుంటే.. రమ్యశ్రీ ఎంచుకున్న కథాంశం, దానికి తగ్గ నేపథ్యం చాలా బాగున్నాయి. కానీ పూర్తి కథను రాసుకున్న విధానం మాత్రం చాలా సాధారణంగా ఉంది. కథ సాధారణంగా ఉన్నా ఎక్కడా విసిగించకపోవడం దర్శకురాలు రమ్యశ్రీ సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. ఇక మిగిలిన వాటిల్లో కె.దత్తు సినిమాటోగ్రఫీ బాగుంది. అరకులోయ అందాలను అద్భుతంగా చూపించాడు.
సునీల్ కశ్యప్, బి.ఎస్.కృష్ణమూర్తి అందించిన పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం సినిమాలోని చాలా సన్నివేశాలకు ప్రాణం పోసింది. వి. నాగిరెడ్డి ఎడిటింగ్ బావుంది. ఈ సినిమాలో మరింత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కళా దర్శకత్వం గురించి.. కళాదర్శకుడి పనితనం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. సహజత్వానికి దగ్గరగా ఉండేలా ప్రతీ లొకేషన్ కి తీర్చిదిద్దారు. ఇక మాటల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి… చాలా సాధారణంగా ఉంటూనే హృదయానికి హత్తుకునే విధంగా మాటలు రాశారు. సహజత్వానికి దగ్గరగా భాష, యాసలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఆకట్టుకునే అంశం. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

స్త్రీ ఆలోచనా విధానంతో, అర్థం చేస్కోవడం, అపార్థం చేసుకోవడం లాంటి అంశాలను ప్రస్తావిస్తూ స్త్రీలను సమాజం ఏ కోణంలో చూస్తుందే చెప్పే ప్రయత్నం చేసిన సినిమా ‘ఓ మల్లి’. కమర్షియల్ సినిమా పంథాకు దూరంగా, సమాంతర సినిమాలకు దగ్గరగా ఉన్న సినిమా ఇది. రమ్యశ్రీ నటన, చెప్పాలనుకున్న అసలు కథ, ఆకట్టుకునే ఓ ఎమోషనల్ జర్నీ తదితర అంశాలను హైలైట్స్‌గా నింపుకొని వచ్చిన ఈ సినిమాలో పూర్తి కథను ఆకట్టుకునేలా చెప్పలేకపోవడం, సినిమాకు సంబంధం లేని తరహా అంశాలతో ప్రచారం చేయడం, సెకండాఫ్‌లో కథను కాస్త పక్కదారి పట్టించడం లాంటివి మైనస్ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే.. రమ్యశ్రీ చెప్పాలనుకున్న ప్రధాన అంశం కోసం, రియలిస్టిక్ సినిమాలను బాగా ఇష్టపడివారు ఈ సినిమా చూడొచ్చు.



---రివ్యూ బై విజ్ఞాన్ దాసరి

మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us

Facebook: https://www.facebook.com/Tollybeatsmedia/

Twitter: https://twitter.com/BeatsTolly

YouTube: https://www.youtube.com/channel/UCmc5YqKIfIWK5pdLCqLJv6w

Blog: http://tollybeatsmedia.blogspot.in

Google+: https://plus.google.com/u/0/112797037583980613598

Thursday, April 14, 2016

ఈడో రకం ఆడో రకం సినిమా రివ్యు


ఈడో రకం ఆడో రకం సినిమా రివ్యు



TOLLY BEATS RATEING: 3.75

హీరోగా, నిర్మాతగా రాణిస్తోన్న మంచు విష్ణు, కెరీర్ ప్రారంభంలోనే హ్యాట్రిక్ హిట్స్‌తో హీరోగా ఓ గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తరుణ్‍ల కాంబినేషన్‌లో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఈడో రకం ఆడో రకం’. కన్ఫ్యూజన్‌నే కామెడీ అంశంగా చేసుకొని తెరకెక్కిందన్న ప్రచారం పొందిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ కన్ఫ్యూజన్ కామెడీ ఎంతవరకు ఆకట్టుకుందీ? చూద్దాం...

కథ :

అర్జున్ (మంచు విష్ణు), అశ్విన్ (రాజ్ తరుణ్).. ఇద్దరూ అల్లరిచిల్లరగా తిరుగుతూ కాలం వెళ్ళదీసే బెస్ట్ ఫ్రెండ్స్. ఓ ఫ్రెండ్ పెళ్ళిలో అర్జున్, నీలవేణి (సోనారిక) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. నీలవేణిని ప్రేమలో పడేసేందుకు అర్జున్, ఆమెతో తాను అనాథననే అబద్ధం చెప్పాల్సి వస్తుంది. ఈ ఒక్క అబద్ధం అర్జున్, అశ్విన్‌ల కథను ఎన్నో మలుపులు తిప్పుతుంది.
ఈ కథ ఇలాంటి మలుపులు తిరుగుతున్నప్పుడే కొన్ని అనుకోని పరిస్థితుల్లో అశ్విన్, నీలవేణికి భర్తగా; అర్జున్, అశ్విన్ ప్రేమించిన అమ్మాయి సుప్రియ (హెబ్బా పటేల్)కి భర్తగా పరిచయం అవ్వాల్సి వస్తుంది. ఒకే ఇంట్లో ఉంటూ ఇలాంటి విచిత్రమైన పరిస్థితులను ఈ ఇద్దరూ ఎలా ఎదుర్కున్నారు? చివరికి వీరి కథలకు ఎలా శుభం కార్డ్ పడిందీ అన్నది సినిమా.

ప్లస్ పాయింట్స్ :

కన్ఫ్యూజన్ కామెడీని ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. లాజిక్‌తో సంబంధం లేకున్నా సరదాగా నవ్వించేలా చేసే ఈ కన్ఫ్యూజన్ కామెడీయే సినిమాను ప్రధానంగా నిలబెట్టిన అంశం. ఫస్టాఫ్‌లో మొదలయ్యే ఈ కన్ఫ్యూజన్‌కు సెకండాఫ్‌లో మరో కన్ఫ్యూజన్‌ను జతచేసి చేసిన ఈ ప్రయత్నం చాలాచోట్ల నవ్వులు పూయిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రయాణంలో లాయర్ నారాయణ పాత్ర ద్వారా పుట్టుకొచ్చే కామెడీ సినిమాకు హైలైట్స్‌లో ఒకటిగా చెప్పాలి. ఈ పాత్రలో రాజేంద్ర ప్రసాద్ తనదైన టైమింగ్, డైలాగ్ డెలివరీతో చాలా చోట్ల నవ్విస్తారు. ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా బాగుంది. అప్పటివరకూ అలా అలా సరదాగా సాగిపోయిన ఫస్టాఫ్‌కు ఇంటర్వెల్‌తో మంచి స్థాయి వచ్చింది.

అశ్విన్ పాత్రలో రాజ్ తరుణ్ ఎప్పట్లానే తన ఎనర్జీని చూపిస్తూ చాలా బాగా నటించాడు. డైలాగ్ డెలివరీలో రాజ్ తరుణ్ ప్రతిభ స్థాయి ఏంటన్నది ఈ సినిమా మరోసారి ఋజువుచేసింది. మంచు విష్ణు అర్జున్ పాత్రలో ఒదిగిపోయి మంచి కామెడీ టైమింగ్‌తో నటించారు. ముఖ్యంగా అక్కడక్కడా మోహన్ బాబు స్టైల్లో చెప్పిన డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటాయి. సోనారిక, హెబ్బా పటేల్ ఇద్దరూ బాగానే నటించారు. ఈ ఇద్దరి అందాల ప్రదర్శన ఈ తరహా అంశాలను కోరుకునేవారికి బాగా నచ్చుతుంది. టైటిల్ సాంగ్, కొక్కో కోడి పాటలు వినడానికి, పిక్చరైజేషన్ పరంగానూ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే ఒకట్రెండు చోట్ల తప్ప కథలో బలమైన ఎమోషన్ ఎక్కడా లేకపోవడం గురించే చెప్పాలి. కథలో కన్ఫ్యూజన్‌కి, దాన్నుంచి పుట్టుకొచ్చే కామెడీతో పాటు ఎమోషన్‌కి కూడా చాలా స్కోప్ ఉన్నా ఎక్కడా ఆ అంశాన్ని పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. ఇక బాగా నవ్వించిన ఫస్టాఫ్‌ తర్వాత వచ్చే సెకండాఫ్‌లో అక్కడక్కడా సినిమా కాస్త పక్కదారి పట్టి బోరింగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు. క్లైమాక్స్ ఫైట్‌కు సినిమా అసలు కథకు సంబంధమే లేదు.

ఇక ఇలాంటి కన్ఫ్యూజన్ కామెడీతోనే వచ్చిన పాతకాలం తెలుగు సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమా తేలిపోతుంది. గతంలో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్ళాం ఊరెళితే’, ‘హంగామా’ లాంటి సినిమాలు ఇదే అంశం ప్రధానంగా వచ్చాయి. ఆ సినిమాలను చూసిన వారికి ఈ సినిమాలో కట్టిపడేసేంత కామెడీ లేదనిపిస్తుంది. ఇక కొన్ని పూర్తిగా అక్రమ సంబంధం అన్న ఆలోచన కల్పించేలా వచ్చే సన్నివేశాలు కథ పరంగానే కాకుండా, ఫక్తు కామెడీ అంశంగా చూసినా చిరాకు తెప్పిస్తాయి. ఇలాంటి సన్నివేశాలకు పూర్తిగా అవకాశమే ఇవ్వకుండా ఉండాల్సింది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ముందుగా దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి గురించి ప్రస్తావించుకోవాలి. కన్ఫ్యూజన్ కామెడీనే ప్రధాన అంశంగా చేసుకొని, ఓ తెలిసిన కథతోనే ఆయన చేసిన ఈ ప్రయత్నాన్ని కామెడీ పరంగానే చూస్తే దర్శకుడిగా విజయం సాధించాడనే చెప్పుకోవచ్చు. అయితే కథలో ఎమోషన్‌కి ఎక్కడా చోటివ్వకపోవడంతో సినిమా కేవలం కామెడీ ప్రయత్నంగానే మిగిలిపోయింది. క్యారెక్టర్స్ డిజైన్ చేయడంలో దర్శకుడి ప్రతిభ బాగుంది.

సాయి కార్తీక్ సంగీతం బాగుంది. టైటిల్ సాంగ్, కొక్కో కోడి పాటలు వినడానికి బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఒకే ఇంట్లో జరిగే కథను సినిమాటోగ్రాఫర్ బాగానే క్యాఫ్చర్ చేశారు. అయితే సినిమాటోగ్రఫీ పరంగా చెప్పుకోదగ్గ స్థాయిలో కట్టిపడేసే సన్నివేశాలు లేవు. ఎడిటింగ్ ఫర్వాలేదనేలా మాత్రమే ఉంది. ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

తీర్పు :

‘ఈడో రకం-ఆడో రకం’.. కన్ఫ్యూజన్ కామెడీయే ప్రధానాంశంగా ప్రచారం పొందుతూ వచ్చిన ఈ సినిమాను నిలబెట్టేది కూడా ఈ అంశమే! మొదట్నుంచీ చివరి వరకూ చాలాచోట్ల నవ్వించే సన్నివేశాలను కలుపుకొని సాగిపోయే ఈ కన్ఫ్యూజన్ కామెడీ, చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పడంలో విజయం సాధించింది. మంచు విష్ణు, రాజ్ తరుణ్‌, రాజేంద్ర ప్రసాద్‍ల కామెడీ టైమింగ్, హీరోయిన్ల అందచందాలు, రెండు మాస్ పాటలను హైలైట్స్‌గా నింపుకున్న ఈ సినిమాకు, అసలు కథలో ఎమోషన్ అన్నది లేకపోవడం, సెకండాఫ్‌లో సినిమా కాస్త నెమ్మదించడం, క్లైమాక్స్ ఫైట్ లాంటివి ప్రతికూల అంశాలు. ఒక్కమాటలో చెప్పాలంటే.. కాసేపు అలా లాజిక్ లాంటి అంశాలను పక్కనబెట్టి, సరదాగా నవ్వుకునే కామెడీ ప్రయత్నంగా ఈ సినిమాను చూస్తే వీడూ, వాడూ ఇద్దరూ బాగా నవ్వించి ఆకట్టుకుంటారు.

---రివ్యూ బై విజ్ఞాన్ దాసరి

మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us

Facebook: https://www.facebook.com/Tollybeatsmedia/

Twitter: https://twitter.com/BeatsTolly

YouTube: https://www.youtube.com/channel/UCmc5YqKIfIWK5pdLCqLJv6w

Blog: http://tollybeatsmedia.blogspot.in

Google+: https://plus.google.com/u/0/112797037583980613598

Wednesday, April 13, 2016

వయసును బయటపెట్టిన మేయర్, తెలుగు సినీ పరిశ్రమని...



వయసును బయటపెట్టిన మేయర్, తెలుగు సినీ పరిశ్రమని...

వయసును బయటపెట్టిన మేయర్, తెలుగు సినీ పరిశ్రమని ఏమన్నారొ చూడండి...


For more Information
LIKE, FOLLOW & SUBSCRIBE us








Friday, April 8, 2016

‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా రివ్యు



‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా రివ్యు

TOLLY BEATS RATING: 2.75/5


కథ :
మూడు రాష్ట్రాల సరిహద్దులను కలుపుకొని ఉన్న రత్తన్ పూర్ ప్రాంత నేపథ్యంలో నడిచే కథే ‘సర్దార్ గబ్బర్ సింగ్’. భైరవ్ సింగ్ (శరద్ కెల్కర్) అనే ఓ రాజకుటుంబానికి చెందిన నియంత రత్తన్ పూర్ ప్రాంతంలోని సహజ వనరులను అక్రమంగా చేజక్కించుకునేందుకు పన్నాగాలు పన్నుతుంటాడు. ఆ క్రమంలోనే ఎన్నో పంట భూములను అక్రమంగా సొంతం చేసుకొని ఓ ఊరినే నాశనం చేస్తాడు. ఇక అదే ప్రాంతంలో ఉండే మరో రాజకుటుంబంతో భరవ్‍కి ఓ శతృత్వం కూడా ఉంటుంది.
ఇలాంటి పరిస్థితులున్న ఊరిని చక్కబెట్టేందుకు సర్దార్ గబ్బర్ సింగ్ (పవన్ కళ్యాణ్) పోలీసాఫీసర్‍గా నియమితుడవుతాడు. ఇక సర్దార్ ఈ భైరవ్ సింగ్ ఆటలను ఎలా కట్టించాడు? రత్తన్ పూర్‌లో అతడికి పరిచయమైన రాజ కుమారి అర్షిని (కాజల్)తో అతడి ప్రేమ ఎటువైపు దారితీసిందీ? అర్షిని కుటుంబానికి, భైరవ్ సింగ్‍కి ఉన్న గొడవలేంటీ? లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకు మొదట్నుంచీ అనుకున్నట్లే పవన్ కళ్యాణ్‌నే మేజర్ హైలైట్‍గా చెప్పుకోవచ్చు. పవన్ మ్యానరిజమ్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్స్ అన్నీ ఆయన అభిమానులను అమితంగా ఆకట్టుకుంటాయి. పవన్, సినిమా మొత్తాన్నీ తన కామెడీ టైమింగ్‍తో భుజాలపై మోసుకొని నడిపించారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా క్లైమాక్స్ పార్ట్‌లో పవన్ ప్రయత్నించిన చిరు వీణ స్టెప్, ఫస్టాఫ్‍లో వచ్చే చిన్న చిన్న కామెడీ బిట్స్, కాజల్‍తో రొమాన్స్ ట్రాక్ అభిమానులకు పండగ వాతావరణం తెచ్చిపెడతాయి. ఇక కాజల్ కూడా ఈ సినిమాకు మరో హైలైట్‌గా చెప్పుకోవచ్చు. రాజకుమారిగా అందంగా కనిపించడంతో పాటు మంచి నటన కూడా కనబరిచింది. విలన్‍గా నటించిన శరద్ కెల్కర్ కూడా బాగా నటించాడు.
ఇక సినిమా పరంగా చూసుకుంటే రత్తన్ పూర్ పరిచయంతో మొదలయ్యే సన్నివేశాలు బాగున్నాయి. అదే విధంగా పాటలన్నీ సినిమాకు మంచి ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. ఇటు మాస్, అటు క్లాస్ రెండు రకాల పాటలూ సినిమాలో మంచి రిలీఫ్ అంశాలుగా చెప్పుకోవచ్చు. తౌబ తౌబ ఫ్యాన్స్‍కి పండగ లాంటి పాట.
మైనస్ పాయింట్స్ :
‘సర్దార్’ సినిమాకు అసలైన మైనస్ పాయింట్ అంటే ఓ స్పష్టమైన కథగానీ, ఓ ఎమోషన్ గానీ లేకపోవడం గురించే చెప్పుకోవాలి. ఇలాంటి కథలు తెలుగులో ఇప్పటికే చాలారాగా, అదే కథకు పెద్దగా ఆకట్టుకోని స్క్రీన్‍ప్లే రాసుకొని మనముందుకు వచ్చి చేసిన ఈ ప్రయత్నంలో చాలా మైనస్‍లే దొర్లాయి. కథలో స్పష్టత లేకపోవడం, ఏమాత్రం ఎమోషన్ లేకుండా కథనం సాగడం, అనవసరమైన సన్నివేశాలు, అతిగా కనిపించే యాక్షన్ సీన్స్.. లాంటివి పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమాకు ఉండాల్సిన లక్షణాలను పూర్తిగా పక్కనబెట్టేసి అర్థం లేని కమర్షియల్ సినిమాగా సర్దార్‍ను మిగిల్చాయి.
కథ మొదలైన కొద్దిసేపటికే సినిమా పట్టు తప్పనట్టు కనిపిస్తుంది. ఇక అక్కణ్ణుంచి ఇంటర్వెల్ వరకూ బాగానే లాక్కొచ్చినా, సెకండాఫ్‍లో మాత్రం సినిమా పూర్తిగా ట్రాక్ తప్పింది. ఇక రెండున్నర గంటలకు పైనే ఉన్న నిడివి కూడా ఈ సినిమాకు మరో మైనస్‌గా చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ బ్లాక్ ఈ స్థాయి క్రేజ్ ఉన్న సినిమాలో ఉండాల్సిన క్లైమాక్సేనా అనేలా ఉంది. విలన్ పాత్రను మొదట్నుంచీ బలంగానే చిత్రించినా, రాన్రానూ ఆ పాత్రను పూర్తిగా పక్కదోవ పట్టించారు. నిక్కీ గిల్రాని పాత్ర ఊరికనే స్క్రీన్ ప్రెజెన్స్ కోసమే ఉన్నట్లు ఉంది.
సాంకేతిక విభాగం :
సాంకేతిక అంశాల విషయానికి వస్తే, అందరికంటే ముందుగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ గురించి చెప్పుకోవాలి. దేవిశ్రీ ఈ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్స్‌లో ఒకరుగా నిలిచారు. ఆయన అందించిన ఆడియో ఇప్పటికే హిట్ కాగా, సినిమాలో విజువల్స్‌తో కలిపి చూసినప్పుడు ఆ పాటలకు మరింత అందం వచ్చింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలోనూ దేవిశ్రీ పనితనం బాగుంది. ఆర్థర్ విల్సన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. రత్తన్ పూర్ నేపథ్యాన్ని ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మా కడలి తనదైన సెట్స్‌తో పట్టుకుంటే, ఆర్థర్ ఆ నేపథ్యాన్ని తన కెమెరాలో చక్కగా బంధించారు. ఎడిటింగ్ పనితనం పెద్దగా ఆకట్టుకునేలా లేదు.
ఇక దర్శకుడు బాబీ విషయానికి వస్తే, పవన్ అందించిన అతిసాదా సీదా కథ, కథనాలతో బాబీ దర్శకుడిగానూ పెద్దగా చేసిందేమీ లేదు. కేవలం పవన్ చరిష్మాను మాత్రమే నమ్ముకున్న బాబీ, ఆ క్రమంలోనే కొన్ని అలాంటి సన్నివేశాలను అందించడంలో సఫలమైనా, దర్శకుడిగా మాత్రం చాలాచోట్ల నిరాశపరిచాడు. బాబీ దర్శకత్వ ప్రతిభను చూపే సన్నివేశాలు సినిమాలో పెద్దగా ఎక్కడా లేవు. పవన్ కళ్యాణ్ పాత్ర చుట్టూ రాసుకున్న కొన్ని సన్నివేశాల్లో బాబీ ప్రతిభ చూడొచ్చు. ఇక సాయిమాధవ్ బుర్రా అందించిన మాటలు బాగానే ఉన్నాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.


తీర్పు :
పవన్ కళ్యాణ్ సినిమా అంటే.. సరదాగా నవ్వించే కామెడీ, పవన్ మార్క్ యాక్షన్ సీక్వెన్స్, పవన్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ లాంటివి ప్రధానంగా ఆకట్టుకునే అంశాలుగా కనిపిస్తూ ఉంటాయి. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కూడా ఇవే అంశాలను నమ్ముకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాగా చెప్పుకోవాలి. ఇక ఈ అంశాలనే ప్లస్‍లుగా నింపుకున్న ఈ సినిమాకు పవన్ చరిష్మానే అతిపెద్ద హైలైట్. వినడానికి, చూడడానికి బాగున్న పాటలు, పవన్-కాజల్‍ల కెమిస్ట్రీ లాంటి మిగతా ప్లస్‍లతో వచ్చిన ఈ సినిమాలో ఓ స్పష్టమైన కథంటూ లేకపోవడం, కథనం కూడా నీరసంగా సాగడం, అనవసర సన్నివేశాలు, అతిగా కనిపించే కొన్ని యాక్షన్ సీన్స్ మైనస్‍ పాయింట్స్. ఒక్కమాటలో చెప్పాలంటే.. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా, తారాస్థాయికి చేరిన అంచనాలను అందుకోవడంలో విఫలమైనా, ఫ్యాన్స్‌ని ఆకట్టుకోవడంలో మాత్రం బాగానే మెప్పించిందని చెప్పొచ్చు. పవన్ చరిష్మా కోసమే చూస్తే ఈ సినిమా బాగానే మెప్పిస్తుంది.

---రివ్యూ బై విజ్ఞాన్ దాసరి

మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us

Facebook: https://www.facebook.com/Tollybeatsmedia/

Twitter: https://twitter.com/BeatsTolly

YouTube: https://www.youtube.com/channel/UCmc5YqKIfIWK5pdLCqLJv6w

Blog: http://tollybeatsmedia.blogspot.in

Google+: https://plus.google.com/u/0/112797037583980613598

SARDAAR GABBAR SINGH movie REVIEW


SARDAAR GABBAR SINGH movie REVIEW



TOLLY BEATS RATING: 2.75/5

Pawan Kalyan’s big budget film, Sardaar Gabbar Singh has hit the screens with a lot of pre-release buzz today. Let’s see whether it lives up to its expectations or not.

Story:-

Gabbar Singh(Pawan Kalyan) is a happy go lucky cop who gets transferred to a ruthless town called Ratanpur. Upon his arrival, he finds out that the entire town is suffering from the evil deeds of Bhairav Singh(Sharad Kelkar).

As time passes by, the princess of Ratanpur, Arshi(kajal) falls in love with Gabbar Singh. Twist in the tale arises when Gabbar Singh comes to know that he is actually sent to that town to solve the problems of Arshi and her royal family which is under the threat of Bhairav Singh.
Rest of the story is as to how Gabbar Singh fights with the mighty Bhairav Singh and solves problems of both Arshi and the entire village.

Plus Points:-

Probably, the one and major asset of Sardaar is power star himself. Right from the word go, it is Pawan’s histrionics that takes center stage. Whatever the fans expect from Pawan, he has given them in a platter. Be it with punch dialogues, dances or fights, Pawan has mesmerized in his role.
Kajal looks drop dead gorgeous as a princess. She has lost weight and looks superb in all her royal costumes. Sharad Kelkar makes a solid Tollywood debut. He is menacing as the bad guy and performs his role to the T. All his confrontational scenes with Pawan Kalyan have been executed well.

First half of the film is quite good with some interesting fan moments. Brahmanandam is decent in his role and evokes some laughs. Interval bang and the comedy skit that comes during the second half has been written well. Mukesh Rishi does his supporting role naturally.

Minus Points:-

Story of the film is ages old and has nothing much interesting to offer. The first half an hour during the second half goes for a toss as the proceedings deviate from the topic completely. Also, the presence of two back to back songs in the second half disturb the flow of the film big time.
There are no major twists and turns as the film moves on a single thread till the end. The proceedings are quite predictable and the climax is also wrapped up in an unconvincing manner. After showcasing Sharad Kelkar’s character in such a powerful light during the first half, he is completely sidelined and becomes ineffective towards the end.

Technical Aspects:-

Music by Devi Sri Prasad is decent as most of the songs suit the mood of the film well. Screenplay by Pawan Kalyan lacks the necessary punch as most of the scenes in the second half go wayward. Dialogues are pretty good and those written for Pawan elevate his charisma. Production values are quite good and special mention should go to the art department for putting up the beautiful Ratanpur set and making it look quite realistic.

Coming to the director Bobby, he has done just an average job with the film. He has dragged a simple point to unnecessary lengths and made the film look tedious at places. But credit should go to him for showcasing Pawan Kalyan in a way that fans will be hugely satisfied with.

Verdict:-

On the whole, Sardaar Gabbar Singh will surely go well with all Pawan Kalyan fans. Right from the word go, it is Pawan’s solid screen presence and energetic performance that impresses you completely. Impressive first half and some stylish thrills are basic assets. But a weak story line, lengthy run time and a dragged out second half spoil the fun to an extent and make this film exclusively for fans only.

---రివ్యూ బై విజ్ఞాన్ దాసరి

మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us

Facebook: https://www.facebook.com/Tollybeatsmedia/

Twitter: https://twitter.com/BeatsTolly

YouTube: https://www.youtube.com/channel/UCmc5YqKIfIWK5pdLCqLJv6w

Blog: http://tollybeatsmedia.blogspot.in

Google+: https://plus.google.com/u/0/112797037583980613598