Latest News

Showing posts with label nannaku prematho. Show all posts
Showing posts with label nannaku prematho. Show all posts

Tuesday, January 5, 2016

‘నాన్నకు ప్రేమతో’ సినిమాపై, సెన్సార్ సభ్యురాలు రిపోర్ట్ నిజమవ్తుందా...!!!



‘నాన్నకు ప్రేమతో’ సినిమాపై, సెన్సార్ సభ్యురాలు రిపోర్ట్ నిజమవ్తుందా...!!!


సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానున్న ఎన్టీఆర్ 25వ చిత్రం ‘నాన్నకు ప్రేమతో’ కోసం జూనియర్ అభిమానులతో పాటు, తెలుగు సినిమా ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ తో విడుదల అయిన టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తే ట్రైలర్ పాత రికార్డుల తుప్పు వొదలకొట్టింది. జూనియర్ స్టైలిష్ లుక్స్, క్రియేటివిటి డైరెక్టర్ సుకుమార్, దేవిశ్రీ మ్యూజిక్ మ్యాజిక్, నిర్మాత ప్రసాద్ భారీతనం సినిమా మీద హైప్ ను పెంచేసాయి. ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అందరూ ఎంతో నమ్మకంగా వున్నారు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ సెన్సార్ బోర్డ్ మెంబర్ పాజిటివ్ రివ్యూని ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ రివ్యూ గురించే చర్చించుకుంటున్నారు.


దుబాయ్ సెన్సార్ బోర్డులో సభ్యురాలు అయిన కీరా సంధూ సందు ట్విటర్ వేదికగా నిత్యం కొత్త సినిమాలకు సంబంధించిన విశేషాలను వెల్లడిస్తుంటుంది. గతంలో కూడా ‘శ్రీమంతుడు’ సినిమా చాలా బాగా నచ్చిందని, హిట్ అవుతుందని విడుదలకు ముందు పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ‘నాన్నకు ప్రేమతో’ మూవీపై కీరా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ కాపీ చూశానని, ఈ చిత్రంలో తారక్ మునుపెన్నడూలేని విధంగా ఎంతో స్టైలిష్‌గా వున్నాడని కొనియాడుతూ, ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అవడం ఖాయమని జోస్యం చెప్పింది. ఆమె వెల్లడించిన అభిప్రాయాల మేరకు శ్రీమంతుడు ఇండస్ట్రీలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది దీంతో ‘నాన్నకు ప్రేమతో’ కూడా ఆమె చెప్పినట్లు హిట్ అవుతుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.